India Needs to Closely Monitor Chinese Inroads into Myanmar | CDS

India Needs to Closely Monitor Chinese Inroads into Myanmar | CDS

మయన్మార్ లో చైనా చొచ్చుకు రావడంపై భారత్ ఓ కన్నేసి ఉంచాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సూచించారు. ఫిబ్రవరిలో మయన్మార్ లో సైనిక తిరుగుబాటు తర్వాత అంతర్జాతీయ ఆంక్షలు విధించారు. కష్టాల్లో ఉన్న మయన్మార్ ను చైనా బీఆర్ ఐ ప్రాజెక్టులోకి తీసుకొస్తోందని రావత్ తెలిపారు. మయన్మార్ లో వేగంగా సాధారణ పరిస్థితి రావడం భారత్ కు, ఈ ప్రాంతానికి చాలా అవసరమని తెలిపారు. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన ప్రదేశాలతో కలిపే సిలిగురి కారిడార్ మయన్మార్ కు అత్యంత సమీపంలో ఉండటంతో చైనా దీనిపై దృష్టిపెట్టిందని వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలో ఒక్క చైనానే కాదు ఇంకా పలు రకాల ఇబ్బందులున్నట్లు రావత్ పేర్కొన్నారు. సరిహద్దుల్లో సరైన అడ్డంకులు లేకపోవడంతో అక్రమ వలసదార్లు, వేర్పాటువాదులు, మాదకద్రవ్యాల సరఫరాకు కేంద్రంగా మారిందని చెప్పారు. ఈ ప్రాంతం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు అప్రమత్తంగా ఉండటంతోపాటు.. భారత్ పొరుగుదేశాలు, అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన సహకారాన్ని కూడా తీసుకోవాలని సీడీఎస్ తెలిపారు.

#LatestNews
#EtvAndhraPradesh
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments